Visakhapatnam District: విశాఖలో పెరుగుతున్న మరణాలు.. భయపడుతున్న ప్రజలు

  • జిల్లాలో ఇప్పటి వరకు 47 మంది మృతి
  • గత 8 రోజుల్లో 34 మంది ప్రాణాలు తీసిన కరోనా
  • విశాఖ ప్రాంతీయ కొవిడ్ ఆసుపత్రిలో పలు జిల్లాల రోగులకు చికిత్స
Surge in Covid death in Visakhapatnam

విశాఖపట్టణంలో కరోనా మరణాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 47 మంది కరోనా బాధితులు మృతి చెందగా, వారిలో 34 మంది గత 8 రోజుల్లోనే మృతి చెందారు. జిల్లాలో మే 1న తొలి మరణం నమోదు కాగా, గత వారం రోజుల్లో మరణాల సంఖ్య పెరిగింది. ఈ నెల 11న ఏడుగురు మృతి చెందగా, 12న ముగ్గురు, 13న నలుగురు, 14న ఆరుగురు, 15న ఐదుగురు, 16న ఆరుగురు, 17న ఒకరు చనిపోగా, నిన్న ఇద్దరు మృతి చెందారు.

మరోవైపు, నగరంలోని ప్రాంతీయ కొవిడ్ ఆసుపత్రి విమ్స్‌లోనూ మరణాలు పెరుగుతున్నాయి. ఈ ఆసుపత్రిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పాజిటివ్ రోగులకు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు మాత్రమే చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ చికిత్స పొందినవారిలో ఈ నెల 17 వరకు 295 మంది డిశ్చార్జ్ కాగా, 62 మంది మృతి చెందారు. 179 మందికి ఇంకా చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.

More Telugu News