AIIMS: సోమవారం నుంచి ఎయిమ్స్ లో 'కోవాగ్జిన్' క్లినికల్ ట్రయల్స్... ఆసక్తి కలవారికి ఆహ్వానం!

Interested persons can be participate in Covaxine clinical trials at Delhi AIIMS
  • 'కోవాగ్జిన్' ను తయారుచేసిన భారత్ బయోటెక్
  • ఇప్పటికే పలు చోట్ల క్లినికల్ ట్రయల్స్
  • జూలై 20 నుంచి ఢిల్లీ ఎయిమ్స్ లో వ్యాక్సిన్ ప్రయోగాలు
భారతదేశపు తొలి కరోనా వ్యాక్సిన్ 'కోవాగ్జిన్' ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది. ప్రాథమిక దశల్లో అద్భుతమైన పురోగతి కనబర్చిన 'కోవాగ్జిన్' వ్యాక్సిన్ హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ రూపొందించింది. దీన్ని ప్రస్తుతం మనుషులపై ప్రయోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల ఈ ప్రయోగాలు కొనసాగుతున్నాయి.

తాజాగా, ఢిల్లీ ఎయిమ్స్ లో సోమవారం నుంచి 'కోవాగ్జిన్' క్లినికల్ ట్రయల్స్ షురూ కానున్నాయి. 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తులపై ఈ వ్యాక్సిన్ ప్రయోగిస్తారు. 100 మంది ఆరోగ్యవంతులను ఈ మేరకు వలంటీర్లుగా ఎంపిక చేసుకుంటారు. ఈ క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవాళ్లు 07428847499 అనే నెంబరుకు కాల్ చేయడం కానీ, ఎస్సెమ్మెస్ ద్వారా కానీ సమాచారం అందించవచ్చు. లేదా, [email protected] మెయిల్ ఐడీ ద్వారా కూడా సంప్రదించవచ్చని ఓ ప్రకటనలో తెలిపారు.
AIIMS
New Delhi
COVAXIN
Corona Virus
Vaccine
Bharat Biotech

More Telugu News