Sake Sailajanath: మూడు రాజధానుల బిల్లును తిరస్కరించండి: గవర్నర్ కు శైలజానాథ్ లేఖ

Sailajanath writes letter to Governor requesting to deny 3 capitals
  • గవర్నర్ వద్దకు చేరిన మూడు రాజధానుల బిల్లు
  • మూడు రాజధానులకు కాంగ్రెస్ వ్యతిరేకమన్న శైలజానాథ్
  • రాష్ట్ర భవిష్యత్తుకు మూడు రాజధానులు వ్యతిరేకమని వ్యాఖ్య
ఏపీలో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లు రాష్ట్ర గవర్నర్ వద్దకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం ఈరోజు బిల్లును పంపించింది. దీంతో, ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు శైలజానాథ్ లేఖ రాశారు. మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని తిరస్కరించాలని లేఖలో ఆయన కోరారు. మూడు రాజధానుల నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని చెప్పారు. మూడు రాజధానులు రాష్ట్ర భవిష్యత్తుకు, అభివృద్ధికి ఆటంకమని తెలిపారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
Sake Sailajanath
Congress
Governor
3 Capitals

More Telugu News