నీతులు చెప్పిన వీరంతా.. గదికి రాలేదని హీరోయిన్లను సినిమాల నుంచి తప్పించినవారే: రిచా చద్దా
- బాలీవుడ్ లో రెండు రకాల మనుషులు ఉన్నారు
- జాలి, దయ ఉన్నవాళ్లు.. లేనివాళ్లు
- బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన వాళ్లు కూడా పక్కవాళ్లకు సాయం చేయరు
ఇండస్ట్రీలో బంధుప్రీతి గురించి చాలా మంది మాట్లాడుతున్నారని... లోపలివాళ్లు, బయటివాళ్లు అంటున్నారని... ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన కొందరు పక్క వారికి చిన్న సహాయం కూడా చేయరని రిచా తెలిపింది. బాలీవుడ్ లో రెండు రకాల మనుషులు ఉన్నారని... జాలి, దయ ఉన్నవాళ్లు... లేని వాళ్లు అని చెప్పింది. సుశాంత్ చనిపోయిన తర్వాత చాలా మంది దర్శకులు నీతి వాక్యాలు చెప్పారని... వారిలో చాలా మంది హీరోయిన్లు తమ గదికి రాలేదని వారిని సినిమాల నుంచి తొలగించినవాళ్లేనని సంచలన వ్యాఖ్యలు చేసింది.