సింగర్ స్మిత ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్.. అసభ్యకర ఫొటోలు పెట్టిన కేటుగాళ్లు!

18-07-2020 Sat 19:01
  • హ్యాకర్ల బారిన పడుతున్న సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు
  • పిచ్చిపిచ్చి పోస్టులు పెడుతున్నారని వాపోయిన స్మిత
  • డిలీట్ చేసినా డిలీట్ కావడం లేదని ఆవేదన
Singer Smitha Facebook accout hacked

ప్రపంచ వ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు హ్యాకర్ల బారిన పడుతున్నారు. వారి సోషల్ మీడియా అకౌంట్లను హ్యాకర్లు హ్యాక్ చేస్తున్నారు. తాజాగా సింగర్ స్మిత ఫేస్ బుక్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఆమె అకౌంట్ ను హ్యాక్ చేసిన ఆగంతుకులు అమ్మాయిల న్యూడ్ పిక్స్, వీడియోలను పోస్ట్ చేశారు. దీంతో స్మిత షాక్ కు గురైంది. హ్యాక్ అయిన విషయాన్ని సంబంధిత అధికారులకు కూడా ఫిర్యాదు చేశామని ఆమె చెప్పింది. హ్యాకర్లు పిచ్చిపిచ్చి పోస్టులు పెడుతున్నారని... వాటిని డిలీట్ చేసినా, డిలీట్ కావడం లేదని వాపోయింది. తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదని ట్విట్టర్ ద్వారా తెలిపింది.