నీ పెన్నులో ఇంక్ అయిపోతుందే తప్ప, నీ బెదిరింపు లేఖల వల్ల ఉపయోగం లేదు: యనమలపై విజయసాయి విసుర్లు

18-07-2020 Sat 18:21
  • గవర్నర్ కు లేఖ రాసిన యనమల
  • ఆ రెండు బిల్లులు ఆమోదించవద్దని విజ్ఞప్తి
  • నీ కోరిక నెరవేరదంటూ యనమలపై ట్వీట్ చేసిన విజయసాయి
Vijaysai Reddy comments on Yanamala

సీఆర్డీఏ రద్దు బిల్లు, వికేంద్రీకరణ బిల్లులకు ఆమోదం తెలుపవద్దంటూ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు గవర్నర్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. 'యనమలా, నీ పెన్నులో ఇంక్ అయిపోతుందే తప్ప నీ బెదిరింపు లేఖల వల్ల ఉపయోగం లేదు' అంటూ వ్యాఖ్యానించారు. "నీవు చెప్పిందే వేదం అనుకుంటే ఎలా? గవర్నర్ ఎవరి సలహాలు తీసుకోవాలో నీవే చెబుతావా? కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలొచ్చేస్తాయా? నీ కోరికలు నెరవేరవు, ఎమోషనల్ బ్లాక్ మెయిల్స్ నడవవు" అంటూ విజయసాయి స్పష్టం చేశారు.