వివేకా హత్యకేసులో రంగంలోకి దిగిన సీబీఐ... ఎస్పీ అన్బురాజన్ తో భేటీ
- అప్పట్లో సంచలనం సృష్టించిన వివేకా హత్య
- ఇప్పటికీ హంతకులెవరో తేలని వైనం
- దర్యాప్తు బాధ్యతలు సీబీఐకి అప్పగించిన హైకోర్టు
కాగా, ఇప్పటివరకు ఈ కేసును విచారించిన సిట్ కీలక రికార్డులను సీబీఐకి అప్పగించనుంది. ఈ కేసులో సిట్ 1,300 మందిని విచారించినా, ఏమాత్రం పురోగతి సాధించలేకపోయింది. ఏడాది కాలం అయినా ఈ కేసులో చిక్కుముడి వీడకపోవడాన్ని హైకోర్టు కూడా ప్రశ్నించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించే సమయంలో హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ హత్య ఘటన ఏపీకి మాత్రమే పరిమితం కాదనిపిస్తోందని, పరాయి రాష్ట్రాల వ్యక్తుల ప్రమేయం కూడా ఉండొచ్చని సందేహం వ్యక్తం చేసింది. అయితే ఇలాంటి కేసుల దర్యాప్తులో సమయం అన్నది ఎంతో ముఖ్యమైనదని, వీలైనంత త్వరగా దర్యాప్తు ముగించాలని సీబీఐకి నిర్దేశించింది.