బటర్ పన్నీర్, పాస్తా తయారీ నేర్చుకుంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!

18-07-2020 Sat 14:17
  • ఢిల్లీ సమీపంలో క్యాంప్ ఏర్పాటు చేసిన సచిన్ పైలట్
  • జైపూర్ లోని స్టార్ హోటల్ లో అశోక్ గెహ్లాట్ ఎమ్మెల్యేలు
  • యోగా చేస్తూ, సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ఎమ్మెల్యేలు
Pasta and Butter Paneer Cooking Lessons For Team Gehlot At Rajasthan Resort

రాజస్థాన్ రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ ఏమీ తెలియని పరిస్థితి నెలకొంది. రెబల్ నేత సచిన్ పైలట్ కు చెందిన 18 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి సమీపంలోని మనేసర్ లో ఉన్న రెండు రిసార్టుల్లో బస చేశారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేలు చేజారకుండా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా జైపూర్ లోని ఒక లగ్జరీ హోటల్ లో క్యాంపును ఏర్పాటు చేశారు.

ఈ రిసార్టులో ఎమ్మెల్యేలంతా వీకెండ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. యోగా చేస్తూ, సినిమాలు చూస్తూ హాయిగా గడుపుతున్నారు. అంతేకాదు అక్కడున్న టాప్ చెఫ్ దగ్గర వంటకాల గురించి తెలుసుకుంటున్నారు. బటర్ పన్నీర్, పాస్తా, పిజ్జా తయారీ గురించి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేలంతా క్యాజువల్ టీషర్టులు, షార్ట్స్ వేసుకుని యోగా చేశారు. నిన్న సాయంత్రం ఎమ్మెల్యేల కోసం 'మొఘల్ ఏ ఆజం' సినిమాను ప్రదర్శించారు.