ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ నిర్ధారణ

18-07-2020 Sat 12:51
  • కరోనా బారినపడ్డ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
  • ఆయన భార్యకు కూడా కరోనా
  • తిరుపతి అమర ఆసుపత్రిలో చికిత్స
Srikalahasti MLA tests corona positive

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కూడా కరోనా బారిన పడ్డారు. కరోనా అనుమానంతో ఆయన ఇటీవల పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది. ఆయన భార్య  శ్రీవాణిరెడ్డికి కూడా కరోనా సోకింది.  

ప్రస్తుతం వారిద్దరు తిరుపతి అమర ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వారికి కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో శ్రీకాళహస్తి వైసీపీ కార్యాలయంలోని సిబ్బంది, ఆ ప్రాంతంలోని పలువురు కార్యకర్తల నుంచి కరోనా పరీక్షల కోసం వైద్య సిబ్బంది నమూనాలు సేకరిస్తున్నారు. ఏపీలో ప్రజా ప్రతినిధులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు.