రఘురామకృష్ణరాజుకు ఝలక్.. సీటు మార్చిన వైసీపీ

18-07-2020 Sat 12:49
  • నాలుగో లైన్ నుంచి ఏడో లైన్ కు మార్పు
  • ఉత్తర్వులు జారీ చేసిన లోక్ సభ  సెక్రటేరియట్
  • వైసీపీ లోక్ సభ పక్షనేత సూచనతో మార్పులు
Raghu Ramkrishna seat changed in Lok Sabha

గత కొంత కాలంగా పార్టీకి ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైసీపీ షాక్ ఇచ్చింది. లోక్ సభలో ఆయన కూర్చునే స్థానాన్ని మార్పించింది. ప్రస్తుతం నాలుగో లైన్ లో కూర్చుంటున్న రఘురాజు సీటు ఏడో లైన్ లోకి మారుస్తూ లోక్ సభ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ లోక్ సభ పక్షనేత సూచన మేరకు ఈ మార్పులు చేసినట్టు అధికారులు తెలిపారు. రఘురామకృష్ణరాజు సీటును మరో సభ్యుడు మార్గాని భరత్ కు కేటాయించారు. రఘురాజును 379 నంబర్ సీటు నుంచి 445 సీటుకు మార్చారు. భరత్ ను సీట్ నంబర్ 385 నుంచి 379కి మార్చారు. కోటగిరి శ్రీధర్ ను 421 నుంచి 385కి మార్చారు. బెల్లన చంద్రశేఖర్ సీటును 445 నుంచి 421కి మార్చారు.