కరోనా లక్షణాలు బయటపడడంతో ఐశ్వర్యారాయ్ ఆసుపత్రికి తరలింపు

17-07-2020 Fri 22:07
  • జ్వరంతో బాధపడుతున్న ఐశ్వర్యారాయ్
  • బచ్చన్ ఫ్యామిలీలో కరోనా కలకలం
  • హోం ఐసోలేషన్ లోనే ఆరాధ్య
Aishwarya Rai hospitalised due to corona

బచ్చన్ ఫ్యామిలీలో కరోనా కల్లోలం ఇంకా తగ్గలేదు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం ముంబయి నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అభిషేక్ అర్ధాంగి ఐశ్వర్యారాయ్ కు కూడా కరోనా పాజిటివ్ రావడంతో ఇప్పటివరకు ఆమె హోం క్వారంటైన్ లోనే ఉన్నారు. అయితే లక్షణాలు బయటపడడంతో పాటు, విడవని జ్వరం వేధిస్తుండడంతో ఆమెను కూడా నానావతి ఆసుపత్రికి తరలించారు. కాగా, ఐశ్వర్య కుమార్తె ఆరాధ్యకు కూడా పాజిటివ్ రాగా, ఆ చిన్నారి హోమ్ ఐసోలేషన్ లో ఉంది.