నాకు సన్నీ లియోన్ అంటే ఇష్టం: వర్మ హీరోయిన్ శ్రీ రాపాక

17-07-2020 Fri 19:16
  • నలుగురు పిల్లలను దత్తత తీసుకున్న సన్నీ లియోన్ వ్యక్తిత్వం గొప్పది
  • మియా మాల్కోవాతో కలిసి నటించను
  • బిగ్ బాస్ హోస్ట్ లలో జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్
I like sunny Leone says Sri Rapaka

రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం 'నేకెడ్'తో హీరోయిన్ శ్రీ రాపాక సెలెబ్రిటీగా మారిపోయింది. పలు యూట్యూబ్ చానళ్లకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన పలువురు హీరోలపై తన అభిప్రాయాలను చెప్పిన శ్రీ... తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తనకు బాలీవుడ్ నటి సన్నీ లియోన్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. నలుగురు పిల్లలను దత్తత తీసుకుని, వారి ఆలనాపాలనా చూసుకుంటున్న ఆమె వ్యక్తిత్వం చాలా గొప్పదని కితాబిచ్చింది.

వర్మ తెరకెక్కిస్తున్న 'నేకెడ్ 2' సినిమాలో మరో అమ్మాయి అయితే బాగుంటుందనే ఉద్దేశంతో వేరే హీరోయిన్ ను తీసుకున్నారని తెలిపింది. వర్మ మరో హీరోయిన్ మియా మాల్కోవాతో కలిసి నటించే అవకాశం వస్తే ఏం చేస్తారనే  ప్రశ్నకు బదులుగా... తాను నటించనని చెప్పింది. స్నేహితులతో గడపడం కన్నా కుటుంబంతో గడపడమే తనకు ఇష్టమని తెలిపింది. బిగ్ బాస్ రియాల్టీ షోను హోస్ట్ చేసిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ అని చెప్పింది.