'ఇప్పుడు నేను మంచి కుక్ ని' అంటున్న తమన్నా!

17-07-2020 Fri 19:06
  • తారలను ఇళ్లకే పరిమితం చేసిన లాక్ డౌన్
  • ఎప్పుడూ కిచెన్ లోకి వెళ్లని ముద్దుగుమ్మ
  • చాలా వంటలు నేర్చేసుకున్న తమ్మూ  
Thamanna says she is a good coock now

'ఇప్పుడు నేను మంచి కుక్ ని కూడా..' అంటూ సంబరపడిపోతోంది కథానాయిక తమన్నా. ఎప్పుడూ సినిమా కథలు వినడాలు..  షూటింగులు.. ప్రయాణాలు .. ఇదే లోకంగా ఇన్నాళ్లూ బతికిన సినిమా తారలను కరోనా లాక్ డౌన్ ఇంటి గుమ్మం దాటకుండా చేసేసింది. దాంతో ఎవరికి వాళ్లు ఇళ్లల్లో బందీలు అయిపోయారు. ఊహించకుండా వచ్చిన ఈ ఖాళీ సమయాన్ని అందరూ ఏదో ఒక విధంగా సద్వినియోగం చేసుకున్నారు. తమన్నా కూడా అలాగే కిచెన్ లో దూరి పలు వంటలు చేయడం నేర్చేసుకుందట.

"ఇంతకుముందు మా ఇంట్లో నేనెప్పుడూ కిచెన్ లోకి అడుగుపెట్టలేదు. అసలు ఏ వస్తువు ఎక్కడుంటుందో కూడా నాకు తెలియదు. దాంతో మొదట్లో కాస్త తికమకపడ్డాను. అయితే, తర్వాత అంతా అదే అలవాటైపోయింది. రోజూ ఏదో ఒక ఫుడ్ ఐటెం వండేదాన్ని. దాంతో వంట చేయడం వచ్చేసింది. ఇప్పుడు కుక్ గా నేను పర్వాలేదు.. సూపర్ కాకపోయినా బాగానే చేస్తాను. ఈ లాక్ డౌన్ పుణ్యమాని ఇప్పుడు నాలోని కుక్ బయటకు వచ్చింది" అంటూ చెప్పుకొచ్చింది తమ్మూ బ్యూటీ.