Sushant Singh Rajput: సుశాంత్ వ్యవహారంలో సీబీఐ విచారణ అక్కర్లేదు... ముంబయి పోలీసులు చాలు: 'మహా' హోంమంత్రి

Maharashtra home minister says no need cbi enquiry into Sushant issue
  • ఇటీవల ముంబయిలో హీరో సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య
  • సీబీఐ విచారణ కోరిన సుబ్రహ్మణ్యస్వామి, రియా చక్రవర్తి
  • ముంబయి పోలీసులు సమర్ధులేనన్న మహారాష్ట్ర హోంమంత్రి
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలంటూ ఇటీవల డిమాండ్లు ఊపందుకున్నాయి. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, సుశాంత్ గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఈ విషయంలో సీబీఐ విచారణ కోరుతున్నారు. రియా చక్రవర్తి దీనిపై అమిత్ షాకు కూడా విజ్ఞప్తి చేశారు. అయితే, సుశాంత్ కేసులో సీబీఐ విచారణ అక్కర్లేదని, ముంబయి పోలీసుల విచారణ సరిపోతుందని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పేర్కొన్నారు.

ఇలాంటి కేసులను చేపట్టడంలో ముంబయి పోలీసులు సమర్థవంతులేనని అన్నారు. సుశాంత్ కు బాలీవుడ్ లో ఉన్న వృత్తివైరం సహా అనేక కోణాల్లో ముంబయి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, సీబీఐతో విచారణ ఎందుకని ప్రశ్నించారు. సుశాంత్ ఆత్మహత్య వ్యవహారంలో ఎవరి తప్పిదం ఉన్నట్టు వెల్లడి కాలేదని, దర్యాప్తు మొత్తం పూర్తయ్యాక వివరాలు పంచుకుంటామని అనిల్ దేశ్ ముఖ్ తెలిపారు. 
Sushant Singh Rajput
Suicide
CBI
Police
Mumbai
Anil Deshmukh
Bollywood
Maharashtra

More Telugu News