Tornado: యానాం ప్రాంతంలో టోర్నడో... నింగికి ఎగిసిన జలధార... వీడియో ఇదిగో!

  • ఓ రొయ్యల చెరువులో టోర్నడో
  • మేఘాల్లోకి వెళ్లిన రొయ్యల చెరువులోని నీళ్లు
  • విస్మయంతో వీక్షించిన స్థానికులు
Tornado in a rare sight appears at Yanam region

అమెరికాలో నిత్యం ఎక్కడో ఓ చోట టోర్నడోలు సుడులు తిరుగుతూ విధ్వంసం సృష్టిస్తుంటాయి. ఆ స్థాయిలో కాకపోయినా భారత్ లో ఇటీవల టోర్నడోలు ఏర్పడుతూ కనువిందు చేస్తున్నాయి. తాజాగా, యానాం ప్రాంతంలో టోర్నడో దృశ్యం దర్శనమిచ్చింది. ఇక్కడి అయ్యనార్ నగర్ లో ఉన్న ఓ రొయ్యల చెరువులోని నీరు అకస్మాత్తుగా ఆకాశానికి ఎగిసింది. వేగంగా సుడులు తిరుగుతూ మేఘాల్లోకి నీరు వెళ్లడాన్ని స్థానికులు విస్మయంతో తిలకించారు. ఈ ప్రాంతంలో టోర్నడోలు గతంలో ఎప్పుడూ ఏర్పడకపోవడంతో చాలామంది తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు.


More Telugu News