ఫేస్ బుక్ ను షేక్ చేసిన ప్రభాస్.. రికార్డు స్థాయిలో ఫాలోవర్లు!

17-07-2020 Fri 15:43
  • ఫేస్ బుక్ లో ప్రభాస్ ఫాలోవర్ల సంఖ్య 1.6 కోట్లు
  • గత 7 రోజుల్లో కొత్తగా 10 లక్షల ఫాలోవర్లు
  • ఫేస్ బుక్ లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న దక్షిణాది స్టార్ ప్రభాస్
Prabhas shaking Facebook

ఇండియన్ సినీ స్టార్లలో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 'బాహుబలి'తో ప్రభాస్ ఒక ప్రభంజనాన్నే సృష్టించాడు. ఈ చిత్రంతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా అవతరించాడు. ఉత్తరాదిలో కూడా ప్రభాస్ కు భారీ ఫాలోయింగ్ ఉంది.

ఇక సోషల్ మీడియాలో కూడా ప్రభాస్ దూకుడు పెంచాడు. ఫేస్ బుక్ లో సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఫేస్ బుక్ లో ప్రభాస్ ఫాలోవర్ల సంఖ్య 1.6 కోట్లకు చేరుకుంది. ఫేస్ బుక్ లో అత్యధిక ఫాలోవర్లను కలిగి ఉన్న సెలెబ్రిటీ ప్రభాస్ కావడం గమనార్హం. మరో విషయం ఏమిటంటే... గత 7 రోజుల వ్యవధిలో ప్రభాస్ ను ఫాలో అవుతున్న వారి సంఖ్య ఏకంగా 10 లక్షలు పెరిగింది. అంటే సోషల్ మీడియాలో ప్రభాస్ ప్రభంజనం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.