ఇంగ్లాండ్ లో పాక్ జట్టు.. కరోనా కలకలం!

17-07-2020 Fri 15:32
  • ఇంగ్లాండ్ లో ఉన్న పాక్ జట్టు
  • వచ్చే నెల 5 నుంచి టెస్ట్ సిరీస్
  • కరోనా బారిన పడుతున్న పాక్ ఆటగాళ్లు
Pakistan cricket team suffers from Corona

పాకిస్థాన్ కు చెందిన 20 మంది ఆటగాళ్లు ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఉన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో పాక్ జట్టు బ్రిటీష్ గడ్డపై అడుగుపెట్టింది. ఇంగ్లాండ్ కు వెళ్లిన పాక్ ఆటగాళ్లలో ఆరుగురికి కరోనా సోకింది. దీంతో మరో ముగ్గురు ఆటగాళ్లు ఇంగ్లాండ్ కు వెళ్లారు.

వీరిలో ఆల్ రౌండర్ కాశీఫ్ భట్టీ కూడా ఉన్నాడు. ఇంగ్లాండ్ కు వెళ్లడానికి ముందు పాక్ లో అతనికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. అయితే... అక్కడకు వెళ్లిన తర్వాత పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఐసోలేషన్ కు వెళ్లాలని అతడిని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కోరింది. వచ్చే నెల 5 నుంచి ఇంగ్లాండ్-పాకిస్థాన్ దేశాల మధ్య మూడు టెస్టులు జరగనున్నాయి. వీటిని బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహించనున్నారు.