KCR: కరోనా గురించి ఆందోళన చెందవద్దు: కేసీఆర్

Dont worry about Corona says KCR
  • కరోనాతో సహజీవనం తప్పదు
  • కరోనా విషయంలో కేంద్రం గందరగోళంలో ఉండేది
  • కరోనాను ఎదుర్కోవడానికి రూ. 100 కోట్లు కేటాయించాం
కరోనా మహమ్మారి గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. కరోనా సోకిన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలను అందిస్తున్నామని... ప్రైవేట్ ఆసుపత్రులకు ఎవరూ వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఎక్కువ మందికి చికిత్స అందుతోందని అన్నారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో కేంద్రం గందరగోళంలో ఉండేదని... అదే సమయంలో తెలంగాణలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్లామని తెలిపారు. కరోనాతో సహజీవనం చేయక తప్పదని అన్నారు. తెలంగాణలో ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం కరోనా చికిత్సలను అందిస్తున్నామని చెప్పారు. కరోనాను ఎదుర్కోవడానికి రూ. 100 కోట్లను కేటాయించామని తెలిపారు.  

డిగ్రీ కాలేజీ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనాన్ని అందిస్తామని కేసీఆర్ చెప్పారు. కళాశాలల ప్రాంగణాలు పచ్చదనంతో నిండుగా ఉండాలని... రకరకాల మొక్కలను పెంచాలని, దీనికి సంబంధించి బోటనీ లెక్చరర్లతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆయుష్ విభాగాల్లో పనిచేసే అధ్యాపకుల పదవీ విరమణ వయసును 65 సంవత్సరాలకు పెంచుతున్నామని తెలిపారు.
KCR
TRS
Corona Virus

More Telugu News