Ravi Prakash: ఈడీ కేసులో ఊరట... టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కు బెయిల్

High Court issues advanced bail to Ravi Prakash
  • అనుమతి లేకుండా నిధులు డ్రా చేశారంటూ రవిప్రకాశ్ పై ఆరోపణలు
  • 2019లో కేసు నమోదు
  • ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ
  • అరెస్ట్ భయంతో కోర్టును ఆశ్రయించిన రవిప్రకాశ్
టీవీ9 న్యూస్ చానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్ కు కాస్త ఊరట కలిగింది. ఈడీ కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గతంలో రవిప్రకాశ్ సీఈవో హోదాలో మరో ఇద్దరితో కలిసి టీవీ9 మాతృసంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ (ఏబీసీఎల్) నుంచి రూ.18 కోట్ల నిధులను అనుమతుల్లేకుండా విత్ డ్రా చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఏబీసీఎల్ ప్రతినిధులు రవిప్రకాశ్ తదితరులపై ఫిర్యాదు చేయగా, గతేడాది కేసు నమోదైంది.

ఈ ఆరోపణలపై ఈడీ వర్గాలు ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) నమోదు చేయడంతో, తనను అరెస్ట్ చేస్తారని భావించిన రవిప్రకాశ్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం రూ.లక్ష చొప్పున రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశిస్తూ ముందస్తు బెయిల్ ఇచ్చింది. అంతేకాదు. ప్రతి శనివారం ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది.
Ravi Prakash
Bail
High Court
TV9
Former CEO
Telangana

More Telugu News