పచ్చ బ్యాచ్ ఢిల్లీలో కొత్త డ్రామాలు మొదలు పెట్టింది!: విజయసాయిరెడ్డి

17-07-2020 Fri 11:26
  • రాష్ట్రపతికి ఫిర్యాదుల పేరుతో డ్రామా
  • నేరం చేసిన వారిపై కేసు పెడితే ప్రజాస్వామ్యం ఖూనీ చేసినట్లట
  • అవినీతిపరులను అరెస్ట్ చేస్తే రాజ్యాంగం విఫలం అయినట్లట
  • మీ డ్రామాలు చూసి ఊసరవెల్లులు సిగ్గుపడుతున్నాయి
vijaya sai reddy fires on tdp

ఏపీలో వైఎస్‌ జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు టీడీపీ పార్లమెంట్ సభ్యుల బృందం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి స్పందించారు. 'రాష్ట్రపతికి ఫిర్యాదుల పేరుతో పచ్చ బ్యాచ్ ఢిల్లీలో కొత్త డ్రామాలు మొదలెట్టింది. నేరం చేసిన వారిపై కేసు పెడితే ప్రజాస్వామ్యం ఖూనీ చేసినట్లు, అవినీతిపరులను అరెస్ట్ చేస్తే రాజ్యాంగం విఫలం అయినట్లు, శాంతి భద్రతలు క్షిణించినట్లు అట. మీ డ్రామాలు చూసి ఊసరవెల్లులు సిగ్గుపడుతున్నాయి' అని అన్నారు.

కాగా, ఏపీలో టీడీపీ హయాంలో అవకతవకలు జరిగాయంటూ విజయసాయిరెడ్డి ఆరోపణలు గుప్పించారు. 'బడికొస్తా పథకం పేరుతో 1,82,000  సైకిళ్లు బాలికలకు పంపిణీ చేశారట. ఎందరికి అందాయో, ఇచ్చినట్టు రికార్డుల్లో రాశారో దర్యాప్తులో వెల్లడవుతుంది. 30-40 ఏళ్ల కిందటి సైకిళ్లు ఇప్పటికీ రోడ్లపైన కనిపిస్తాయి. మూడేళ్లలోనే అమ్మాయిల సైకిళ్ల  ‘గంట’లు ఎందుకు మూగబోయాయో శీను మాయ తెలియాల్సి ఉంది' అని విమర్శించారు.