క్వారంటైన్ కు తనతో పాటు ప్రియుడిని తీసుకెళ్లేందుకు లేడీ కానిస్టేబుల్ ప్లాన్!

17-07-2020 Fri 10:20
  • ప్రియుడిని భర్తగా చూపించిన యువతి
  • నమ్మి ఒకే గదిలో క్వారంటైన్ చేసిన అధికారులు
  • యువకుడి భార్య రావడంతో బండారం బట్టబయలు
Lady Conistable Plan to Stay in Quarentine with Lover

క్వారంటైన్ సెంటర్ కు వెళ్లాల్సి వచ్చిన ఓ మహిళా కానిస్టేబుల్, తన ప్రియుడిని తన వెంట తీసుకెళ్లేందుకు మాస్టర్ ప్లాన్ వేసి, అధికారుల నుంచి అనుమతి తీసుకుంది. అయితే, ప్రియుడి భార్యకు విషయం తెలియడంతో ఆ ప్లాన్ బెడిసికొట్టింది. ఈ ఘటన నాగపూర్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే, ఇక్కడ ఓ లేడీ కానిస్టేబుల్ కు, మరో ఉద్యోగికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.

దీంతో ఆమెను క్వారంటైన్ సెంటర్ కు వెళ్లాలని ఉన్నతాధికారులు సూచించగా, ప్రియుడిని భర్తగా పరిచయం చేసి, అతనికి కూడా వైరస్ సోకి ఉండవచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేయడంతో, వారు అతన్ని కూడా ఆమెతో పాటు క్వారంటైన్ సెంటర్ కు పంపి ఒకే గదిలో ఉంచారు. ఇక తన భర్త ప్రియురాలితో కలిసి క్వారంటైన్ సెంటర్ లో ఉన్నాడని తెలుసుకున్న అతని భార్య, అక్కడికి రాగా లోపలికి అనుమతించలేదు.

దీంతో ఆమె బజాజ్ నగర్ పోలీసు స్టేషన్ కు వెళ్లి, తన భర్తపై ఫిర్యాదు చేసి, లేడీ కానిస్టేబుల్ కు, తన భర్తతో ఉన్న బంధం గురించి వివరించింది. దీంతో విచారించిన అధికారులు, ఆమె చెప్పింది వాస్తవమేనని నిర్ధారించుకుని, అతన్ని మరో క్వారంటైన్ సెంటర్ కు పంపించారు. సదరు మహిళా కానిస్టేబుల్ నిర్వాకంపై విచారణ ప్రారంభించారు.