'ఆర్ఆర్ఆర్'లో ఏ హీరోకి ఎక్కువ ప్రాధాన్యం?... బుర్రా సాయి మాధవ్ వివరణ!

17-07-2020 Fri 09:46
  • రెండు పాత్రలూ బ్యాలెన్స్ తో ఉంటాయి
  • అభిమానులకు అనుమానాలు అక్కర్లేదు
  • డైలాగులు సమానంగా పేలుతాయన్న బుర్రా
Burra Sai Madhav Comments on RRR

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా 'ఆర్ఆర్ఆర్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది. ఈ సినిమా గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటల రచయిత బుర్రా సాయిమాధవ్, చిత్రంలో హీరో పాత్రల ప్రాధాన్యం గురించి వివరించారు.

సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలకు సమానమైన ప్రాముఖ్యత ఉందని, అంతలా రాజమౌళి బ్యాలెన్స్ చేశారని చెప్పారు. తాను సైతం ఇద్దరికీ సమానంగా డైలాగులు రాశానని అన్నారు. పాత్రల నిడివి కూడా సమానంగానే ఉంటుందని, ఈ విషయంలో అభిమానులకు ఎటువంటి అనుమానాలూ అక్కర్లేదని స్పష్టం చేశారు. 

ఫ్యాన్స్ అంచనాలను ఈ సినిమా చాలా సులువుగా చేరుకుంటుందని, భారత సినిమా రంగాన్ని మరో మెట్టు ఎక్కిస్తుందని సాయి మాధవ్ వ్యాఖ్యానించారు. కాగా, సాయి మాధవ్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంభాషణలను అందించారు. 'ఖైదీ నంబర్ 150', 'మహానటి', 'గౌతమీపుత్ర శాతకర్ణి', 'కంచె' వంటి హిట్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి.