Sachin pilot: పైలట్ మంచోడే.. కానీ పరిస్థితులు ఇక్కడి వరకు రావడమే బాధాకరం: అభిషేక్ మను సింఘ్వీ

Sachin Pilot sought my legal advice
  • పైలట్ నాకు మంచి స్నేహితుడు
  • ఫోన్ చేసి సలహా అడిగితే కుదరదన్నాను
  • పైలట్ ప్రతిభను మెచ్చుకునే నేతలు చాలామందే ఉన్నారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్ మంచోడేనని, కాకపోతే పరిస్థితి ఇక్కడి వరకు రావడమే బాధగా ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. సచిన్, తాను మంచి స్నేహితులమని, అతడి ప్రతిభను మెచ్చుకునే నేతలు చాలామందే ఉన్నారని అన్నారు.

రాజస్థాన్ సంక్షోభం తర్వాత పైలట్ తనకు ఫోన్ చేసి న్యాయ సలహా అడిగారని ప్రసిద్ధ లాయర్ అయిన సింఘ్వీ తెలిపారు. అయితే, తాను స్పీకర్ జోషి వైపు ఉన్నానని, సలహా ఇవ్వలేనని చెప్పేశానని పేర్కొన్నారు. ఇద్దరం మంచి స్నేహితులమే అయినప్పటికీ ఈ విషయంలో మాత్రం సలహా ఇవ్వలేనని చెప్పేశానన్నారు. స్వయంగా స్పీకరే నోటీసులు జారీ చేశారు కాబట్టి, ఇలాంటి సమయంలో తానెలా సలహా ఇస్తానని ప్రశ్నించారు.
Sachin pilot
Abhishek Manu Singhvi
Congress
Rajasthan

More Telugu News