Air India: నేటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు పునఃప్రారంభం

  • నాలుగు నెలల తర్వాత నేటి నుంచి అంతర్జాతీయ విమాన సేవలు  
  • అమెరికా, ఫ్రాన్స్‌, జర్మనీల నుంచి విమానాలు
  • సర్వీసులు ప్రారంభించనున్న ఎయిర్ ఇండియా 
International Flights to Resume Operations From Today

కరోనా కారణంగా దాదాపు నాలుగు నెలలుగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు నేడు తిరిగి ప్రారంభం కానున్నాయి. అమెరికా, ఫ్రాన్స్ దేశాల నుంచి మన దేశానికి పాక్షికంగా విమానాలు నడవనున్నాయి. అమెరికాకు చెందిన యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ ఈ నెల 17-31 మధ్య 18 విమానాలను నడపనుంది. ఢిల్లీ-న్యూయార్క్‌ మధ్య ప్రతి రోజూ, ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో మధ్య వారానికి మూడు రోజులు విమానాలు నడపనున్నట్టు పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.

ఈ నెల 18 నుంచి ఆగస్టు 1 మధ్య ఎయిర్ ఫ్రాన్స్ కు చెందిన 28 విమానాలు నడవనున్నాయి. అలాగే, ఈ రెండు దేశాలకు ఎయిర్ ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. మరోపక్క, ఢిల్లీ, లండన్ మధ్య రోజుకు రెండు విమానాలు నడిపేందుకు బ్రిటన్‌తో ఒప్పందం చేసుకోనున్నట్టు మంత్రి తెలిపారు. జర్మనీకి చెందిన ఎయిర్ లుఫ్తాన్సాతో దాదాపు ఒప్పందం పూర్తయిందని మంత్రి పూరి వివరించారు.

More Telugu News