కరోనా బారినపడిన హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి

17-07-2020 Fri 07:18
  • హైదరాబాద్ లో భారీ సంఖ్యలో కేసులు
  • శ్వేతా మహంతి కార్యాలయంలో 15 మందికి
  • కార్యాలయ సిబ్బంది ద్వారా కలెక్టర్ కు సోకిన కరోనా
Hyderabad district collector Swetha Mohanty tested corona positive

తెలంగాణలో నిత్యం వెయ్యికి తగ్గకుండా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి కూడా కరోనా బాధితుల జాబితాలో చేరారు. ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమెతో పాటు డ్రైవర్ కు, కంప్యూటర్ ఆపరేటర్ కు సైతం కరోనా నిర్ధారణ అయింది. శ్వేతా మహంతి కార్యాలయంలో మొత్తం 15 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. వారి ద్వారానే కలెక్టర్ కు  కరోనా సోకిందని సమాచారం. ఈ నేపథ్యంలో, వైద్య పరీక్షలు చేయించుకున్న ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చింది.