వెంటలేటర్ పై మధ్యప్రదేశ్ గవర్నర్ టాండన్.. క్షీణించిన ఆరోగ్యం!

16-07-2020 Thu 20:46
  • సరిగా పని చేయని ఊపిరితిత్తులు, కాలేయం
  • ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన టాండన్
  • పరిస్థితి విషమించడంతో ఆందోళనలో కుటుంబసభ్యులు
MP Governor Lalji Tandon Put On Venitalor Support

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఆరోగ్యం క్షీణించింది. ఊపిరితిత్తులు, కాలేయం సరిగా పనిచేయకపోవడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను లక్నోలోని మేదాంత ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు. ఒక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. ఈ సందర్భంగా డాక్టర్ రాకేశ్ కపూర్ మాట్లాడుతూ ఊపిరితిత్తులు, కాలేయం సరిగా పని చేయడం లేదని... ఆయన ఆరోగ్యం మరింత విషమించిందని చెప్పారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

తన స్వస్థలంలో 10 రోజులు గడిపేందుకు గత నెల 9న లక్నోకు టాండన్ వెళ్లారు. అనారోగ్యానికి గురైన ఆయన జూన్ 11న ఆసుపత్రిలో చేరారు. వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించగా ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. తరువాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్  అయ్యారు. రోజుల వ్యవధిలోనే ఆయన మళ్లీ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. టాండన్ అనారోగ్యం నేపథ్యంలో యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మధ్యప్రదేశ్ గవర్నర్ బాధ్యతలను అదనంగా అప్పగించారు.