నడిరోడ్డుపై డ్యాన్స్ చేయాలనుందంటున్న అంజలి

16-07-2020 Thu 20:24
  • కరోనాతో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు
  • షూటింగుల కోసం ఎదురుచూస్తున్న నటీనటులు
  • డ్యాన్స్ ఫొటోను షేర్ చేసిన అంజలి
Want to dance on road says Anjali

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' సినిమా ద్వారా హీరోయిన్ అంజలి మంచి పేరు తెచ్చుకుంది. తన అందంతో పాటు, అమాయకమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు అమ్మాయి అయిన అంజలికి టాలీవుడ్ లో కంటే... తమిళ ఇండస్ట్రీలోనే ఎక్కువ పేరు వచ్చింది. ఈ విషయాన్ని గతంలో తనే ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రస్తుతం ఆమె 'నిశ్శబ్దం' అనే చిత్రంలో నటిస్తోంది.

అయితే కరోనా వల్ల షూటింగులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ముఖ్యంగా తమిళనాడులో కరోనా కేసులు భారీ సంఖ్యలో ఉండటంతో... షూటింగులు ఎప్పుడు ప్రారంభమవుతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హీరోలు, హీరోయిన్లు తమ ఇళ్లలో పనులు, వర్కౌట్లు, డ్యాన్సులు చేస్తూ... వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ అభిమానులకు కాస్త వినోదాన్ని పంచుతున్నారు. అంజలి కూడా తాను డ్యాన్స్ చేస్తున్న ఫొటోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. కరోనా తగ్గిన వెంటనే రోడ్డుపైకి వచ్చి డ్యాన్స్ చేయాలని ఉందని తెలిపింది.