నాలుగు నెలల తర్వాత  హైదరాబాద్ చేరుకున్న రకుల్

16-07-2020 Thu 19:57
  • కరోనా వల్ల ముంబైలో ఉండిపోయిన రకుల్
  • 20 రోజులు గురుగావ్ లో తల్లిదండ్రులతో గడిపిన హర్యానా భామ
  • రకుల్ కు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం
Rakul Preet Singh reaches Hyderabad after 4 months

కరోనా నేపథ్యంలో ముంబైలోను, గురుగావ్ లోనూ ఉండిపోయిన సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకుంది. దాదాపు 4 నెలల తర్వాత భాగ్యనగరానికి విచ్చేసింది. ఈ సందర్భంగా రకుల్ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన వెంటనే సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని వెల్లడించింది.

తన సొంత రాష్ట్రం హర్యానా కంటే హైదరాబాదే తనకు చాలా ఇష్టమని రకుల్ గతంలో తెలిపింది. అందుకే ఇక్కడే సొంత ఇంటిని కూడా ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం నితిన్ సరసన రకుల్ నటిస్తోంది. ఈ చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు, దాదాపు 3 నెలల తర్వాత ముంబై నుంచి ఆమె గురుగావ్ కు వెళ్లింది. అక్కడ తన తల్లిదండ్రులతో కలిసి 20 రోజుల పాటు గడిపింది. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుంది.