Internship: నేరుగా వచ్చేయండి... పోస్టుగ్రాడ్యుయేట్లు, మేనేజ్ మెంట్ విద్యార్థులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

AP Government offers internship for Management graduates and Postgraduates
  • ప్రకటన విడుదల చేసిన ఏపీ సర్కారు
  • దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 22 తుది గడువు
  • నెలకు రూ.6 వేల గౌరవవేతనం
కరోనా భూతం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న మానవ వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని ఏపీ సర్కారు భావిస్తోంది. విజయవాడలో ఉన్న కొవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో పోస్టు గ్రాడ్యుయేట్లు, మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేట్ల సేవలు ఉపయోగించుకునేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఇంటర్న్ షిప్ ప్రకటన విడుదల చేసింది.

కరోనా సంక్షోభ నివారణ చర్యల్లో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో పనిచేసేందుకు ఆసక్తి కలిగిన మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేట్లు, పోస్టుగ్రాడ్యుయేట్లు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చని ఆ ప్రకటనలో వెల్లడించింది. దరఖాస్తులకు ఈ నెల 22 తుది గడువు.

విజయవాడ ఎంజీ రోడ్ లోని న్యూ ఆర్ అండ్ బి బిల్డింగ్ లో ఉన్న  స్టేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు ఉద్యోగార్థులు నేరుగా రావొచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, విశ్లేషణ సామర్థ్యం, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, సాఫ్ట్ స్కిల్స్ అవసరం.

ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారు మూడ్నెల్ల పాటు పనిచేయాల్సి ఉంటుంది. నెలకు రూ.6 వేల చొప్పున గౌరవవేతనం చెల్లిస్తారు. ఇంటర్న్ షిప్ ను విజయవంతంగా పూర్తిచేసినవారికి ఓ సర్టిఫికెట్ కూడా ఇస్తారు.
Internship
Management
Postgraduates
Covid Crisis
AP Command Control Centre
Vijayawada
Andhra Pradesh

More Telugu News