వైసీపీ అరాచకాలను బయటపెట్టిన న్యాయమూర్తిపై దాడి చేయడం దారుణం: నారా లోకేశ్

16-07-2020 Thu 17:10
  • చిత్తూరు జిల్లాలో జడ్జిపై దాడి
  • తీవ్రంగా ఖండించిన లోకేశ్
  • దళితులపై జగన్ రెడ్డి కక్షగట్టాడంటూ వ్యాఖ్యలు
Lokesh reacts over attack on a magistrate in Chittoor district

రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతున్న ఏపీలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శించారు. చిత్తూరు జిల్లాలో దళిత న్యాయమూర్తి రామకృష్ణపై వైసీపీ నేతలు దాడి చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని లోకేశ్ ట్వీట్ చేశారు.  అధికార పక్ష నేతల అరాచకాలను బయటపెడుతున్నందుకే న్యాయమూర్తి రామకృష్ణపై భౌతికదాడికి దిగారని, ప్రభుత్వ అక్రమాలను బట్టబయలు చేస్తున్నందుకు జగన్ రెడ్డి దళితులపై కక్ష కట్టారని ఆరోపించారు.