అమరావతి గ్రాఫిక్సే అయితే 12వ ఫ్లోర్ నుంచి మీరెందుకు దూకకూడదు?: విజయసాయిరెడ్డిని ప్రశ్నించిన దేవినేని ఉమ

16-07-2020 Thu 16:56
  • వైజాగ్ ను సరికొత్తగా మార్చుతామన్న విజయసాయి
  • గత ప్రభుత్వం గ్రాఫిక్స్ చూపించిందని విమర్శలు
  • జగన్ వైజాగ్ ను నాశనం చేశాడన్న ఉమ
Devineni Uma counters Vijayasai Reddy comments on Vizag

వైజాగ్ రూపురేఖలు మార్చేందుకు ఓ కొత్త మాస్టర్ ప్లాన్ రూపుదిద్దుకుంటోందని, గత ప్రభుత్వంలా గ్రాఫిక్స్ చూపించకుండా, సీఎం జగన్ నిబద్ధతతో పనిచేస్తున్నారంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఘాటుగా స్పందించారు. "మా నాయకుడు చంద్రబాబు ఐదేళ్లలో వైజాగ్ ఆదాయాన్ని రెండింతలు చేశారు. వైజాగ్ ను ఐటీ, డేటా, ఫిన్ టెక్ కేంద్రంగా మార్చారు. ఇప్పుడు దాన్ని జగన్ ధ్వంసం చేస్తున్నాడు. ఇటీవలే మీ సహచరుడు బొత్స సందర్శించిన అమరావతిని గ్రాఫిక్స్ అంటున్న మీరు అక్కడి భవనాల 12వ ఫ్లోర్ నుంచి కిందికి దూకి అవి గ్రాఫిక్సేనని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎందుకు నిరూపించకూడదు?" అంటూ ట్వీట్ చేశారు.