సుశాంత్ మరణంపై సీబీఐ విచారణ జరిపించండి: అమిత్ షాకు రియా చక్రవర్తి విజ్ఞప్తి

16-07-2020 Thu 16:16
  • ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సుశాంత్
  • సుశాంత్ గాళ్ ఫ్రెండ్ అంటూ రియా చక్రవర్తి గురించి ప్రచారం
  • సుశాంత్ మరణానికి కారణాలేంటో తెలియాలన్న రియా
Rhea Chakraborty wants Amit Shah CBI enquiry into Sushant demise

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకుని వారాలు గడుస్తున్నా, ఇప్పటికీ ఆ విషయం ఏదో ఒక రూపేణా ప్రస్తావనకు వస్తూనే ఉంది. కొన్నిరోజులుగా ఈ వ్యవహారంలో సుశాంత్ గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో, రియా చక్రవర్తి ట్విట్టర్ లో స్పందించారు. ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.

"గౌరవనీయ అమిత్ షా గారూ... నాపేరు రియా చక్రవర్తి, నేను సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గాళ్ ఫ్రెండ్ ని. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హఠాన్మరణం చెంది నెల గడచిపోయింది. నాకు ప్రభుత్వంపై సంపూర్ణ నమ్మకం ఉంది. అయితే న్యాయం కోసం ఈ వ్యవహారంలో సీబీఐ విచారణ జరిపించాలని సవినయంగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. అమిత్ షా సర్... నేను కోరుకునేది ఒక్కటే... సుశాంత్ ఇంత తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి ఒత్తిళ్లు కారణమయ్యాయో తెలుసుకోవాలనుకుంటున్నాను. సత్యమేవ జయతే" అంటూ ట్వీట్ చేశారు.