Corona Virus: తిరుమల క్షేత్రంలో 14 మంది అర్చకులకు కరోనా... దర్శనాలు కొనసాగుతాయన్న వైవీ

  • తిరుమల కొండపై కరోనా కలకలం
  • 40 మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా
  • 60 ఏళ్లకు పైబడిన అర్చకులు కోరితే రిలీవ్!
Fourteen priests tested corona positive in Tirumala

సుదీర్ఘ విరామానంతరం ఇటీవలే తిరుమల క్షేత్రంలో శ్రీవారి దర్శనాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, కరోనా మహమ్మారి శ్రీవారి క్షేత్రాన్ని కూడా వదల్లేదు. 14 మంది అర్చకులు సహా మొత్తం 140 మంది ఉద్యోగులు కరోనా బారినపడ్డారని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. 

ఈ నేపథ్యంలో దర్శనాలు మళ్లీ నిలిపివేస్తారంటూ ప్రచారం జరుగుతుండడం పట్ల ఆయన వివరణ ఇచ్చారు. కట్టుదిట్టమైన చర్యల నడుమ దర్శనాలు కొనసాగుతాయని తెలిపారు. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, భక్తుల సహకారం లభిస్తున్నందువల్ల దర్శనాలు  నిలిపివేసే పరిస్థితి లేదన్నారు. కాగా, కరోనా వ్యాప్తి దృష్ట్యా 60 ఏళ్లకు పైబడిన అర్చకులు కోరితే రిలీవ్ అయ్యే అవకాశం కల్పించాలని టీటీడీ భావిస్తోంది. వారి స్థానంలో టీటీడీ అనుబంధ ఆలయాల నుంచి అర్చకులను పిలిపించి స్వామివారి సేవలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News