సుశాంత్ మరణంపై సీబీఐ విచారణ జరిపించండి: మోదీకి లేఖ రాసిన స్వామి

16-07-2020 Thu 14:30
  • హీరో సుశాంత్ ఆత్మహత్యపై అనుమానాలు
  • విచారణ జరుపుతున్న ముంబై పోలీసులు
  • ఇప్పటికే సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన పప్పూ యాదవ్
Subrahmanian Swamy writes letter to Modi demanding CBI probe in Susant Singh Rajputs case

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అసలు నిజాలు వెలుగుచూడాలంటే ఈ కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని సుశాంత్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా స్పందించారు. ఈ కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాశారు.

సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న రెండు రోజుల తర్వాత బీహార్ కు చెందిన మాజీ ఎంపీ పప్పూ యాదవ్ కూడా సీబీఐ ఎంక్వైరీ కోసం డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ లేఖను అమిత్ షా కార్యాలయం సంబంధిత శాఖకు ఫార్వర్డ్ చేసింది. ఇప్పుడు తాజాగా సుబ్రహ్మణ్యస్వామి కూడా సీబీఐ విచారణకు డిమాండ్ చేయడం గమనార్హం.