సమంత చాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన రష్మిక

16-07-2020 Thu 14:03
  • కొనసాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్
  • టాలీవుడ్ తారల నుంచి విశేష స్పందన
  • రాశి ఖన్నా, కల్యాణి ప్రియదర్శన్ లను నామినేట్ చేసిన రష్మిక
Rashmika Mandanna accepts Green India Challenge

టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కరోనా రోజుల్లోనూ నిరాటంకంగా ముందుకు సాగుతోంది. ఈ చాలెంజ్ కు టాలీవుడ్ తారల నుంచి మంచి స్పందన వస్తోంది. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ఇటీవలే మొక్కలు నాటిన సమంత... ఆపై రష్మిక మందన్నను నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. సమంత చాలెంజ్ ను అంగీకరించిన రష్మిక తన నివాసంలో కొన్ని మొక్కలు నాటింది. ఆపై రాశి ఖన్నా, కల్యాణి ప్రియదర్శన్, ఆషికా ఆనంద్ లను గ్రీన్ ఇండియా చాలెంజ్ కు నామినేట్ చేసింది. ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని అవిచ్ఛిన్నంగా కొనసాగించాలని వారికి పిలుపునిచ్చింది.