అన్న క్యాంటీన్లను ఆపేయడం బాధాకరం: వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు

16-07-2020 Thu 13:34
  • టీడీపీ హయాంలో అన్న క్యాంటీన్లు బాగుండేవి
  • దళిత క్రైస్తవుల వల్ల హిందూ దళితులు నష్టపోతున్నారు
  • ముద్రగడ స్వాభిమానం కలిగిన వ్యక్తి
Stopping Anna Canteens is very sad says Raghu Ramakrishna Raju

సొంత పార్టీపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆయన మాట్లాడుతూ, తనకు పూర్తి భద్రత కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చెప్పినట్టుందని... అందుకే కేంద్రం వెంటనే తనకు రక్షణ కల్పించడం లేదేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీకి ఉత్సాహాన్ని కలిగించే వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో అన్న క్యాంటీన్లు బాగుండేవని... వాటిని ఆపేయడం బాధాకరంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం మన రాష్ట్ర ఖజానా పరిస్థితి దారుణంగా ఉందని... ఈ పరిస్థితుల్లో క్యాంటీన్లను నడపడం కూడా కష్టమేనని అన్నారు.

దళిత క్రైస్తవులు ఎస్సీ కోటాను అనుభవిస్తున్నారని... వీరివల్ల హిందూ దళితులు నష్టపోతున్నారని రఘురాజు చెప్పారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మంచి వ్యక్తి అని, స్వాభిమానం కలవారని కితాబునిచ్చారు. కాపుల కోసం ఆయన ఎంతో కృషి చేశారని ప్రశంసించారు.