మీ ముఖంపై మొటిమ చూశానన్న నెటిజన్‌.. కంగ్రాట్స్ చెప్పిన నిహారిక!

16-07-2020 Thu 13:18
  • అభిమానులతో నాగబాబు కూతురు ముచ్చట్లు 
  • నిహారిక ముఖంపై మొటిమను గుర్తించిన నెటిజన్‌
  • 'కంగ్రాట్స్.. మీ ఇంటికి అవార్డు పంపిస్తా' అంటూ నిహారిక రిప్లై
niharika mocks netizen

ఓ నెటిజన్‌కు సినీనటుడు నాగబాబు కూతురు, నటి నిహారిక చురక అంటించింది. సోషల్ మీడియాలో తాజాగా ఆమె అభిమానులతో మాట్లాడింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఈ సమయంలో ఆమె ముఖంపై ఓ మొటిమ చూశానంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

దీనిపై నిహారిక స్పందిస్తూ 'కంగ్రాట్స్.. ఇందుకుగాను మీ ఇంటికి అవార్డు పంపిస్తా' అంటూ సరదాగా జవాబిచ్చింది. కాగా, ప్రస్తుతం తాను తమిళంలో ఓ సినిమాలో నటిస్తున్నానని ఆమె చెప్పింది.

కాగా, తనకు కాబోయే భర్త ఫోటోలను  నిహారిక ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన విషయం తెలిసిందే. గుంటూరు కుర్రాడు జొన్నలగడ్డ చైతన్యను ఆమె పెళ్లి చేసుకోబోతుంది. ఆగస్టు 13న వీరి నిశ్చితార్ధం జరగనుంది. చైతన్యతో దిగిన ఫొటోను తన ఫోన్ వాల్ పేపర్‌గా పెట్టుకున్నానని నిహారిక తెలిపింది.