ఈ ఆరు లక్షణాలు వున్న వారితో జాగ్రత్త సుమా!: అభిమానులకు అమితాబ్ సూచన

16-07-2020 Thu 13:01
  • ఆసుపత్రి నుంచి కూడా అభిమానులకు బిగ్‌ బీ సందేశాలు
  • ఆరు ప్రతికూల ధోరణులున్నవారికి దూరంగా ఉండాలి
  • కొందరిలో అసూయ, అయిష్టత, అసంతృప్తి వుంటాయి 
  • కోపం, అనుమానం, ఇతరులపై ఆధారపడి జీవిస్తారు
  • ఈ అలవాట్లు ఉన్న వారు జీవితాంతం బాధపడుతుంటారు
Amitabh Bachchan tweets from hospital

కరోనా బారిన పడిన బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌ ముంబైలోని నానావతి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న విషయం తెలిసిందే. ఆ ఆసుపత్రి నుంచి ఆయన తన అభిమానులను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తూ సందేశాలు ఇస్తూనే ఉన్నారు.

తాజాగా ఆయన ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈ ఆరు ప్రతికూల ధోరణులు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలని చెప్పారు. 'అసూయ, అయిష్టత, అసంతృప్తి, కోపం, ఇతరులపై అనుమానం, ఇతరులపై ఆధారపడి జీవించడం వంటి అలవాట్లు ఉన్న వారు జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. అందుకే, మనం ఈ లక్షణాలు ఉండే వారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి' అంటూ బిగ్‌ బీ ట్వీట్ చేశారు.

కాగా, అమితాబ్‌తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్‌ బచ్చన్, మనవరాలు ఆరాధ్య బచ్చన్ కూడా కరోనాకు చికిత్స తీసుకుంటోన్న విషయం తెలిసిందే. అమితాబ్‌ భార్య జయా బచ్చన్‌కు మాత్రం కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది.