పవర్ ఫుల్ టైటిల్ తో మెగా మేనల్లుడి చిత్రం!

16-07-2020 Thu 12:43
  • ప్రస్తుతం సాయితేజ్ చేతిలో రెండు సినిమాలు 
  • తాజాగా నూతన దర్శకుడికి గ్రీన్ సిగ్నల్
  • 'భగవద్గీత సాక్షిగా' అనే టైటిల్ నిర్ణయం
Sai Tej new film with powerful title

చిరంజీవి మేనల్లుడిగా చిత్ర రంగ ప్రవేశం చేసి, పలు చిత్రాల ద్వారా మంచి ఆర్టిస్టుగా నిరూపించుకున్న సాయి తేజ్ గతేడాది 'ప్రతిరోజూ పండగే' వంటి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో 'సోలో బ్రతుకే సో బెటర్' అనే చిత్రాన్ని చేస్తున్నాడు. దీని తరువాత దేవ కట్టా దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సివుంది. ఈ క్రమంలో తాజాగా మరో  సినిమాని కూడా లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది.

నూతన దర్శకుడు ఒకరు చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఆ ప్రాజక్టుకి సాయితేజ్ ఓకే చెప్పాడని సమాచారం. దీనికి 'భగవద్గీత సాక్షిగా' అనే పవర్ ఫుల్ టైటిల్ని పెట్టినట్టు చెబుతున్నారు. టైటిల్ని బట్టి చూస్తే, ఇదేదో నేరసంబంధమైన పాయింట్ చుట్టూ కోర్టుల నేపథ్యంలో అల్లిన కథలా అనిపిస్తోంది. దేవ కట్టా సినిమా తర్వాత ఈ కొత్త సినిమా సెట్స్ కి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట. దీని గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.