పవన్ కల్యాణ్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన శ్రుతిహాసన్!

16-07-2020 Thu 12:41
  • 'వకీల్ సాబ్' సినిమాలో నటిస్తున్నా
  • ఏ పాత్ర అనే విషయం ఇప్పుడు చెప్పలేను
  • నాకు డ్రీమ్ రోల్ అంటూ ఏమీ లేదు
Shruti Haasan gives clarity on Pawan Kalyan Movie

చాలా గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ సినిమా చేస్తున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత ఆయన 'వకీల్ సాబ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 'పింక్' చిత్రానికి ఇది రీమేక్. బాలీవుడ్ లో అమితాబ్ పోషించిన పాత్రను ఈ చిత్రంలో పవన్ పోషిస్తున్నారు. బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు.

మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతిహాసన్ ఎంపికైందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆమె స్పందించింది. తాను 'వకీల్ సాబ్'లో నటిస్తున్నానని చెప్పింది. అయితే తన పాత్ర ఏమిటనేది ఇప్పుడు చెప్పలేనని తెలిపింది. తనకు డ్రీమ్ రోల్స్ అంటూ ఏమీ లేవని... ఏ ప్రాత వచ్చినా చేయడానికి తాను సిద్ధంగానే ఉన్నానని చెప్పింది. ప్రస్తుతం తన దృష్టి అంతా నటనపైనే ఉందని... సంగీతంపై దృష్టి పెట్టడానికి చాలా సమయం పడుతుందని తెలిపింది.