Rajasthan: సచిన్ పైలట్ ను వదులుకోవడానికి ఇష్టపడని రాహుల్... విమర్శలు వద్దని అశోక్ గెహ్లాట్ కు సూచన!

  • పార్టీలోనే ఉండాలని కోరుకుంటున్న రాహుల్
  • వ్యతిరేకంగా మాట్లాడవద్దని గెహ్లాట్ కు సూచన
  • వెల్లడించిన కాంగ్రెస్ వర్గాలు
Congress Sources said that Rahul Wants Sachin Piolt

కాంగ్రెస్ పార్టీలో రాజస్థాన్ యువనేత సచిన్ పైలట్ కు తలుపులు తెరిచే ఉన్నాయని, సచిన్ పార్టీలోనే ఉండాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. సచిన్ పైలట్ పై ఘాటు విమర్శలు వద్దని సీఎం అశోక్ గెహ్లాట్ కు ఆయన సూచించారని, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని అన్నారని తెలిపాయి.

నిన్న అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ బీజేపీతో సచిన్ పైలట్ బేరసారాలు (హార్స్  ట్రేడింగ్) చేస్తున్నారని సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. విమర్శలు, ప్రతి విమర్శల నేపథ్యంలో, వారిద్దరి మధ్యా దూరం పెరుగుతూ ఉంటే, అది రాజస్థాన్ లో పార్టీకి నష్టం కలిగిస్తుందని రాహుల్ గాంధీ భావిస్తున్నట్టు సమాచారం.

కాగా, రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పటి నుంచి సచిన్ పైలట్ తో రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా టచ్ లో లేనప్పటికీ, తన ప్రతినిధుల ద్వారా సంప్రదిస్తూనే వున్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రియాంకా గాంధీ మాత్రం కల్పించుకుని సచిన్ పైలట్ తో రెండు మూడు సార్లు మాట్లాడారు. ఇప్పుడిక నిర్ణయం తీసుకోవాల్సింది సచిన్ పైలట్ మాత్రమేనని, కాంగ్రెస్ పార్టీ ఆయన్ను వదులుకోవాలని మాత్రం భావించడం లేదని పార్టీ సీనియర్ వర్గాలు వెల్లడించాయి.

More Telugu News