నా సినిమాలు పది విడుదలైనా ఇంత కిక్ రాదు: యంగ్‌ హీరో కార్తికేయ

16-07-2020 Thu 12:19
  • చిరుతో కలిసి వీడియోలో నటించిన కార్తికేయ
  • మాస్కులు ధరించాలని సందేశం
  • చిరుతో ఇది తన జీవితకాల జ్ఞాపకమంటూ ట్వీట్
karthikeya about video with chiru

కరోనా విజృంభణ మరింత పెరిగిపోతోన్న నేపథ్యంలో మాస్క్ తప్పనిసరిగా ధరించండంటూ మెగాస్టార్‌ చిరంజీవి ఓ వీడియో రూపంలో సందేశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో ఆయన యంగ్‌ హీరో కార్తికేయతో కలిసి కనిపిస్తారు. కరోనా నేపథ్యంలో మంచి సందేశాత్మక వీడియోలో మెగాస్టార్‌తో కలిసి నటించడం పట్ల కార్తికేయ అమితానందం వ్యక్తం చేశారు.  
               
           
కరోనా భయం నెలకొన్న వేళ, షూటింగ్‌ని మిస్ అవుతున్న సమయంలో, తర్వాత ఎలా ఉంటుందనే భయం మధ్య తీసిన ఈ ఒక్క వీడియోతో తమ భయాలన్నీ పోయాయని కార్తికేయ చెప్పాడు. ఓ మంచి పని కోసం మెగాస్టార్‌తో తాను కలిసి ఈ వీడియో చేశానని చెప్పాడు. తన సినిమాలు పది విడుదలైనా ఈ కిక్ రాదని ఆయన చెప్పాడు. మెగాస్టార్ చిరంజీవి‌తో ఇది తన జీవితకాల జ్ఞాపకమంటూ ఆయన ఈ వీడియోను ట్వీట్ చేశాడు.