జడ్జిలకే భద్రత లేకపోతే ఇక సామాన్యుడికి రక్షణ ఎలా ఉంటుంది?: యనమల

16-07-2020 Thu 11:33
  • వ్యవస్థలను కూడా వైసీపీ దగా చేస్తూ మోసం చేసింది
  • దేనిని కూల్చాలన్నా రిమోట్‌ కంట్రోల్ జగన్ చేతిలోనే
  • న్యాయమూర్తి రామకృష్ణపై దాడిని ఖండిస్తున్నాం
  • రాజకీయ నిరుద్యోగుల కోసమే శాండ్‌ కార్పొరేషన్
yanamala criticizes ap govt

వైసీపీ నేతల తీరుపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో పేదలనే కాకుండా, వ్యవస్థలను కూడా వైసీపీ మోసం చేసిందని ఆయన ఆరోపించారు. దేనిని కూల్చాలన్నా ధ్వంసం చేయాలన్న రిమోట్‌ కంట్రోల్ ముఖ్యమంత్రి జగన్ చేతిలోనే ఉందని ఆయన తెలిపారు.

న్యాయమూర్తి రామకృష్ణపై జరిగిన దాడిని తాము ఖండిస్తున్నామని యనమల రామకృష్ణుడు తెలిపారు. జడ్జిలకే భద్రత లేకపోతే ఇక సామాన్యుడికి రక్షణ ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. రాజకీయ నిరుద్యోగుల కోసమే శాండ్‌ కార్పొరేషన్ ఏర్పాటుకు ఏపీ మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని ఆయన ఆరోపించారు. వైసీపీ శాండ్‌ మాఫియాకే శాండ్‌ కార్పొరేషన్‌ పగ్గాలు కూడా అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.