'మీసాలు మెలేయడం వీరత్వమే కానీ అది ఒకప్పుడు' అంటూ మాస్కులపై మెగాస్టార్ చిరు ఆసక్తికర వీడియో

16-07-2020 Thu 10:50
  • మాస్క్ తప్పనిసరిగా ధరించండి
  • మిమ్మల్ని మీరు కాపాడుకోండి
  • మీ కుటుంబాన్ని, దేశాన్ని కాపాడండి.. ప్లీజ్
  • ముఖానికి మాస్కులు ధరించడం వీరుడి లక్షణం
chiru says Every single person can do their bit to break chains of transmission

కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇప్పటికే పలుసార్లు వీడియోల రూపంలో సందేశం ఇచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా మరో వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో మాస్కుల ప్రాధాన్యత గురించి ఆయన తనదైన శైలిలో వివరించే ప్రయత్నం చేశారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అథనోమ్ ఈ నెల 13న ఓ విషయాన్ని తెలిపారని ఆయన అన్నారు. కరోనా విపత్కర పరిస్థితులు మరింత పెరిగిపోతాయని చెప్పారని గుర్తు చేశారు. దీన్ని అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి ప్రబలకుండా తమ వంతు కృషి చేయాలని, కరోనా సంక్రమణకు ముగింపు పలకాలని చెప్పారని చిరు తెలిపారు.
                                                
'అందుకే, మాస్క్ తప్పనిసరిగా ధరించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ కుటుంబాన్ని, దేశాన్ని కాపాడండి.. ప్లీజ్' అని చిరంజీవి ట్వీట్ చేశారు. 'మీసాలు మెలేయడం వీరత్వమే.. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు ముఖానికి మాస్కులు ధరించడం వీరుడి లక్షణం' అని పేర్కొంటూ, ఆయన మాస్కులు తప్పనిసరిగా ధరించాలని వీడియో రూపంలో సందేశం ఇచ్చారు. యంగ్‌ హీరో కార్తీకేయతో కలిసి ఆయన చేసిన ఈ వీడియో మంచి సందేశాత్మకంగా ఉంది.