BCCI: సోదరుడికి కరోనా.. హోం క్వారంటైన్‌లోకి బీసీసీ చీఫ్ గంగూలీ

  • క్యాబ్  జాయింట్ సెక్రటరీ స్నేహాశీష్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ
  • హెల్త్ ప్రొటోకాల్ ప్రకారం గంగూలీ హోం క్వారంటైన్
  • బెల్లె వ్యూ ఆసుపత్రిలో చేరిన గంగూలీ సోదరుడు
Sourav Ganguly in home quarantine after his brother tests positive

టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ హోం క్వారంటైన్‌లోకి వెళ్లాడు. ఆయన సోదరుడు, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) సంయుక్త కార్యదర్శి అయిన స్నేహాశీష్ గంగూలీకి కరోనా నిర్ధారణ కావడంతో గంగూలీ వెంటనే హోం క్వారంటైన్‌లోకి వెళ్లాడు. బెంగాల్ ఫస్ట్-క్లాస్ మాజీ ఆటగాడైన స్నేహాశీష్  గత కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో కరోనా పరీక్షలు చేయించుకోగా కొవిడ్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అతడిని బెల్లె వ్యూ ఆసుపత్రిలో చేర్చారు.

‘‘స్నేహాశీష్ గత కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్నాడు. అతడికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో వైరస్ సోకినట్టు నేడు నిర్ధారణ అయింది. దీంతో ఆయన బెల్లె వ్యూ ఆసుపత్రిలో చేరారు’’ అని క్యాబ్ అధికారి ఒకరు నిన్న తెలిపారు. రిపోర్టులు సాయంత్రం వచ్చాయని, హెల్త్ ప్రొటోకాల్స్ ప్రకారం సౌరవ్ గంగూలీ కూడా కొంతకాలం పాటు హోం క్వారంటైన్‌లో ఉంటారని గంగూలీ సన్నిహితుడు ఒకరు పేర్కొన్నారు.

More Telugu News