కరోనా మహమ్మారి అసలు రూపం.. బంధించిన అమెరికా పరిశోధకులు!

16-07-2020 Thu 09:15
  • అత్యాధునిక ఎలక్ట్రాన్ మైక్రోస్కోపుతో చూసిన శాస్త్రవేత్తలు
  • చుట్టూ ఎర్రని మంటల్లా, మధ్యలో పసుపు రంగుతో గుండ్రంగా ఉన్న వైరస్
  • ఆకర్షించేలా మహమ్మారి రూపం
Photos of Corona virus captured by US scientists

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నిజ స్వరూపం బయటపడింది. కొవిడ్‌కు కారణమయ్యే సార్స్-కొవ్-2 వైరస్‌ను శాస్త్రవేత్తలు బంధించారు. మంటలు ఎగసిపడుతున్నట్టు చుట్టూ ఎర్రగా, మధ్యలో పూర్తిగా పసుపు పచ్చని రంగుతో గుండ్రంగా చూడగానే ఆకర్షించేలా ఉందీ వైరస్. అమెరికాలోని జాతీయ అలర్జీ, అంటువ్యాధుల నివారణ కేంద్రంలో అత్యాధునిక ఎలక్ట్రాన్ మైక్రోస్కోపులో చూసినప్పుడు వైరస్ ఇలా కనిపించడంతో దానిని ఫొటోల్లో బంధించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.