మహారాష్ట్రలో ఏమాత్రం తగ్గని కరోనా జోరు.. నిన్న ఒక్క రోజే 7,975 కేసులు

16-07-2020 Thu 08:22
  • రాష్ట్రంలో నిన్న 233 మంది మృతి
  • పెరుగుతున్న రికవరీ రేటు
  • రాష్ట్రంలో ఇంకా 1,11,801 యాక్టివ్ కేసులు
7975 cases came to light in yesterday alone in Maharashtra

కరోనా వైరస్ జోరు మహారాష్ట్రలో ఏమాత్రం తగ్గడం లేదు. నిన్న ఒక్క రోజే ఏకంగా 7,975 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. వీరితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారినపడిన బాధితుల సంఖ్య 2,75,640కు చేరుకుంది. వీరిలో 1,11,801 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. అలాగే, నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 233 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండడం ఊరటనిచ్చే అంశం. నిన్న 3,606 మంది రోగులు కొవిడ్ నుంచి కోలుకుని ఇళ్లకు చేరారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 1,52,613కు చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం రికవరీ రేటు 55.37 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది.