సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం   

16-07-2020 Thu 07:35
  • చిరంజీవితో తమన్నా ఐటెం పాట 
  • హీరోయిన్ గా రెహ్మాన్ కూతురు
  • హిందీలోకి మరో తెలుగు సినిమా
Thamanna to shake a leg with Chiranjeevi

*  చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' చిత్రంలో ఐటెం సాంగ్ ఎవరు చేస్తారన్నది సస్పెన్స్ గా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఐటెం పాటకు తమన్నా పేరు వినిపిస్తోంది. చిరంజీవి పక్కన డ్యాన్స్ చేయడానికి తమన్నా బాగుంటుందన్న ఉద్దేశంతో ఆమెను సంప్రదిస్తున్నారట.
*  సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ కూతురు రహీమా నటనారంగంలోకి ప్రవేశించనుంది. రెహ్మాన్ చిన్నమ్మాయి అయిన రహీమాకి ఇప్పటికే సంగీతంలో ప్రావీణ్యం వుంది. ఇటీవలే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి నివాళులర్పిస్తూ ఓ ఆల్బం కూడా విడుదల చేసింది. ఇక హీరోయిన్ కావాలని కలలు కంటున్న రహీమాను వచ్చే ఏడాది వెండితెరకు పరిచయం చేయడానికి రెహ్మాన్ ప్లాన్ చేస్తున్నాడట.
*  మరో తెలుగు సినిమా హిందీలో రీమేక్ కానుంది. కీరవాణి తనయుడు సింహా హీరోగా రితేష్ రాణా దర్శకత్వంలో వచ్చిన 'మత్తువదలరా' చిత్రం తెలుగులో హిట్టయింది. ఇప్పుడీ క్రైం కామెడీ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.