kedarnath: కేదార్‌నాథ్ పర్యటనలో నలుగురు యాత్రికుల గల్లంతు.. అడవిలో గాలిస్తున్న మూడు బృందాలు

  • డెహ్రాడూన్, నైనిటాల్ జిల్లాల నుంచి యాత్రకు వెళ్లిన యువకులు
  • వాసుకీతాల్-త్రియుగీనారాయణ్‌కు కాలిబాటన వెళ్తూ అదృశ్యం
  • గాలింపు చర్యలకు ఆటంకం కలిగిస్తున్న ప్రతికూల వాతావరణం
4 pilgrims missing after kedarnath visit

కేదార్‌నాథ్ పర్యటనకు వెళ్లి గల్లంతయిన నలుగురు యాత్రికుల కోసం సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. వారి ఆచూకీని కనుగొనేందుకు అటవీ ప్రాంతంలో మూడు బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. ఈ నెల 13న డెహ్రాడూన్‌, నైనిటాల్ జిల్లాలకు చెందిన హిమాన్షు, గురుంగ్, హర్ష్ భండారి, మోహిత్ భట్, జగదీష్ భట్‌లు కేదారినాథ్ ధామ్ యాత్రకు వెళ్లారు. అక్కడి నుంచి వాసుకీతాల్-త్రియుగీనారాయణ్‌కు కాలిబాట‌న బయలుదేరారు.

అయితే రెండు రోజులు గడిచినా ఇంటికి రాకపోవడం, వారి నుంచి ఫోన్లు కూడా రాకపోవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు ప్రయాగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన మూడు పోలీసు బృందాలు వారు ప్రయాణించినట్టుగా చెబుతున్న అడవి బాటలో గాలింపు చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ సాయం కూడా తీసుకున్నారు. అయినప్పటికీ వారి జాడ కనిపించ లేదు. దీనికితోడు భారీ వర్షం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు గాలింపు చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. అయినప్పటికీ పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

More Telugu News