Madakasira: మహిళా వాలంటీర్ అంత్యక్రియలను అడ్డుకున్న గ్రామస్తులు!

  • మడకశిరలో నిన్న రాత్రి చనిపోయిన వాలంటీర్ నాగలక్ష్మి
  • శ్మశానవాటికకు తరలిస్తుండగా అడ్డుకున్న స్థానికులు
  • స్థానికులతో గొడవపడ్డ నాగలక్ష్మి బంధువులు
Locals opposes women volunteers funerals amid corona fears in Anantapur Dist

కరోనా వైరస్ మనుషుల మధ్య బంధాలను, అనుబంధాలను చెరిపేస్తోంది. మానవత్వాన్ని చంపేస్తోంది. ఒక వ్యక్తికి కరోనా సోకిందని తెలియగానే... ఆ వ్యక్తిని అంటరానివారిగా చూస్తున్నారు. ఇక చనిపోయిన వారి పరిస్థితి మరీ దారుణం. శ్మశానవాటికలలో అంత్యక్రియలకు కూడా అనుమతించడం లేదు. తాజాగా అనంతపురం జిల్లా మడకశిరలో ఇలాంటి దారుణమే మరొకటి చోటుచేసుకుంది. గ్రామ సచివాలయంలో వాలంటీర్ గా పని చేస్తున్న నాగలక్ష్మి నిన్న తీవ్ర అస్వస్థతకు  గురైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది.

మడకశిరలోని కంటైన్మెంట్ జోన్లలో నాగలక్ష్మి విధులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో, కరోనా వల్లే ఆమె చనిపోయిందనే ప్రచారం జరిగింది. నిన్న రాత్రి ఆమె మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలిస్తుండగా స్థానిక శివాపురం కాలనీవాసులు అడ్డుకున్నారు. ఇక్కడ అంత్యక్రియలు చేయవద్దని అడ్డుపడ్డారు. దీంతో, వారితో మృతురాలి బంధువులు గొడవకు దిగడంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కాలనీ వాసులకు నచ్చచెప్పారు. దీంతో, ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి.

More Telugu News